Hyderabad: బాగ్‌లింగంపల్లి గోదాములో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

నగరంలోని బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాగ్‌లింగంపల్లి వీఎస్టీ సమీపంలోని గోదాములో అగ్ని ప్రమాదం సంభవించి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్‌ సామగ్రి మంటల్లో కాలి బూడిదయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన గోదాము పరిసర ప్రాంతాల్లో బస్తీలు ఉండడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 02 Feb 2023 09:53 IST

Hyderabad: బాగ్‌లింగంపల్లి గోదాములో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు