Andhra News: ప్రభాస్ అభిమానుల అత్యుత్సాహం.. థియేటర్‌లో మంటలు

ప్రభాస్ అభిమానుల అత్యుత్సాహం థియేటర్‌లో అగ్నిప్రమాదానికి కారణమైంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని వెంకట్రామ థియేటర్‌లో ‘బిల్లా’ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేశారు. అయితే, సినిమా ప్రదర్శన సమయంలో అభిమానులు సీట్ల మధ్యే బాణసంచా కాల్చారు. దీంతో సీట్లు కాలిపోయి థియేటర్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. థియేటర్ మొత్తం పొగ వ్యాపించడంతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు బయటకు పరుగులు తీశారు.

Updated : 23 Oct 2022 16:48 IST

Tags :

మరిన్ని