Fire Accident: బాణసంచా మంటలు అంటుకొని టెంట్‌ దగ్ధం.. తృటిలో తప్పిన ప్రమాదం

భీంగల్‌: నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌ మండలం పురనిపెట్‌ గ్రామాంలో తెలంగాణ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న చెరువుల పండగలో ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రి ప్రశాంత్‌రెడ్డి రావడంతో ఆయనకు స్వాగతం పలుకుతూ కార్యకర్తలు బాణసంచా పేల్చారు. దాంతో పక్కనే ఉన్న  టెంట్‌పై బాణసంచా పడి మంటలు అంటుకున్నాయి. మంటల్లో టెంట్‌ పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చకుకున్నారు. స్థానికులు నీళ్లు పోసి మంటలను అదుపులోకి తెచ్చారు.

Published : 08 Jun 2023 12:24 IST

Fire Accident: బాణసంచా మంటలు అంటుకొని టెంట్‌ దగ్ధం.. తృటిలో తప్పిన ప్రమాదం

Tags :

మరిన్ని