FTX: ఎఫ్‌టీఎక్స్‌ వ్యవస్థాపకుడు బ్యాంక్ మన్ ఫ్రీడ్ అరెస్ట్‌

దివాలా తీసిన అగ్రశ్రేణి క్రిప్టో ఎక్స్ఛేంజీ ‘ఎఫ్‌టీఎక్స్‌’ వ్యవస్థాపకుడు బ్యాంక్ మన్ ఫ్రీడ్‌ను బహమాస్‌లో అరెస్టు చేశారు. అతన్ని త్వరలోనే అమెరికాకు అప్పగించనున్నారు. 10 బిలియన్  డాలర్ల కస్టమర్ల ఫండ్‌ను  రహస్యంగా ఉపయోగించినట్లు ఫ్రీడ్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఎఫ్ టీఎక్స్ దివాలా వల్ల ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా క్రిప్టో మదుపరులు తీవ్రంగా నష్టపోయారు. 134 ఎఫ్‌టీఎక్స్‌ అనుబంధ సంస్థల నెత్తిపై 5,000 కోట్ల డాలర్ల అప్పులు ఉన్నాయి.

Published : 13 Dec 2022 17:18 IST

మరిన్ని