Jupally: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అరెస్ట్‌.. ఉద్రిక్తత

ధాన్యం కొనుగోలులో అవకతవకలపై నాగర్‌ కర్నూల్‌లో.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. రైతులకు న్యాయం చేయాలంటూ.. ఆయన రైతులతో కలిసి కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. సుమారు 2 గంటలు ధర్నా చేపట్టినా కలెక్టర్ రాలేదు. దీంతో అక్కడి నుంచి జూపల్లి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం ముందు జూపల్లికి ఎలాంటి హామీ రాకపోవడంతో.. అక్కడే మార్కెట్ యార్డు వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కలగజేసుకొని జూపల్లిని అదుపులోకి తీసుకున్నారు. జూపల్లిని అరెస్టు చేసి తెలకపల్లి ఠాణాకు తరలించారు. ఈ క్రమంలో జూపల్లి అనుచరులకు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది.

Updated : 29 May 2023 16:22 IST

Tags :

మరిన్ని