GHMC: జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మికి చేదు అనుభవం..!

జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మికి ఉప్పల్ చిలుకానగర్‌లో చేదు అనుభవం ఎదురైంది. చిలుకానగర్‌లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనకు వచ్చిన మేయర్‌ను స్థానిక భారాస నేతలు అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేను పిలువకుండా ఆయన నియోజకవర్గంలో మేయర్ ఎలా శంకుస్థాపనలు చేస్తారంటూ కార్యకర్తలు అగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ విజయలక్ష్మితో భారాస కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. జీహెచ్‌ఎంసీ మేయర్ ప్రోటోకాల్ పాటించడంలేదంటూ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

Published : 20 Dec 2022 13:51 IST

GHMC: జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మికి చేదు అనుభవం..!

Tags :

మరిన్ని