Hyderabad: ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడు నందకుమార్‌ అక్రమ నిర్మాణాలు కూల్చివేత..!

ఫిల్మ్‌నగర్‌లో అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కూల్చివేశారు. దక్కన్‌ కిచెన్ సమీపంలో ఉన్న రెండు నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. కూల్చివేతకు సంబంధించిన నిర్మాణాలు ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుడు నందకుమార్‌కు చెందినవిగా అధికారులు తెలిపారు. ఈ కూల్చివేతలు  అధికారులు అక్రమంగా  చేస్తున్నారని.. నందకుమార్ భార్య చిత్రలేఖ ఆరోపించారు. తమకు గతంలో ఒక నోటీస్ ఇచ్చారని.. మేము లీజ్ అగ్రిమెంట్ రిప్లైగా ఇచ్చామని వెల్లడించారు. ఇది కేవలం రాజకీయ కక్షతోనే  చేస్తున్నారని అరోపించారు. దుకాణాలోపల ఉన్న వస్తువులు కూడా తీసుకోవడానికి సమయం ఇవ్వలేదని ఆరోపించారు. ఆధారాలు మొత్తం అధికారులకు అందిస్తామన్నారు. ప్రస్తుతం కోర్టులో పెండింగ్ లో ఉందన్నారు.  

Published : 13 Nov 2022 20:30 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు