Crime News: ఆర్‌ఎంపీ నిర్లక్ష్యం..బాలిక మృతి

ఆర్‌ఎంపీ నిర్లక్ష్యంతోనే బాలిక మృతి చెందిందంటూ అనంతపురం జిల్లా నార్పలలో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. బాలిక మృతదేహంతోక్లినిక్ వద్ద బంధువులు నిరసన చేపట్టడంతో ఆర్‌ఎంపీ పరారయ్యాడు. పదో తరగతి చదువుతున్న చంద్రికకు గొంతు కింద గడ్డలు రావడంతో చికిత్స కోసం ప్రైవేటు క్లినిక్ ను ఆశ్రయించారు. వారం రోజులుగా అక్కడే చికిత్స తీసుకున్నారు. ఇవాళ ఉదయం బాలిక ఆరోగ్యం విషమించడంతో ఆర్‌ఎంపీ దగ్గరకు తీసుకెళ్లగా అనంతపురం ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. 

Published : 09 Aug 2022 16:24 IST

మరిన్ని

ap-districts
ts-districts