Google: గూగుల్‌లో ఉద్యోగ భద్రత ఇవ్వలేనన్న సీఈవో సుందర్‌ పిచాయ్‌

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. 10వేల మంది ఉద్యోగులను తొలగించనుందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. భవిష్యత్తును అంచనా వేయడం కష్టమని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్  వ్యాఖ్యానించడం ఉద్యోగులను కలవరపెడుతోంది. మాంద్యం భయాలతో టెక్ సంస్థలన్నీ సిబ్బందిని ఇంటికి పంపుతున్న వేళ తమ పరిస్థితి ఏంటని ఉద్యోగులు అడగ్గా.. ఇప్పుడే భరోసా ఇవ్వలేనని సుందర్ చెప్పినట్లు తెలిసింది. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించినట్లు సమాచారం.

Published : 14 Dec 2022 10:36 IST

మరిన్ని