ఆ సమస్యల పరిష్కారంపై సీఎస్‌ సానుకూలంగా స్పందించారు.: బొప్పరాజు

వీఆర్‌ఏ (VRA)ల డీఏతో పాటు వీఆర్‌వో (VRO) గ్రేడ్-2కు సంబంధించిన అంశాలను తక్షణమే పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని... ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. సీఎస్‌తో జరిగిన చర్చలపై ఏపీ జేఏసీ అమరావతి నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. 84 రోజులుగా చేస్తున్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్చలకు పిలిచిందన్నారు. కొన్ని సమస్యలపై సీఎస్‌ తక్షణమే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని బొప్పరాజు వెల్లడించారు.

Published : 01 Jun 2023 16:54 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు