YSRCP: ‘మంత్రి వస్తే పువ్వులు చల్లండి’: డ్వాక్రా మహిళలకు ప్రభుత్వ ఉద్యోగి పాఠాలు

శ్రీకాకుళం జిల్లా మందస మండల ఏపీఎమ్‌గా పనిచేస్తున్న ప్రసాదరావు.. మంత్రి అప్పలరాజు పట్ల స్వామిభక్తిని చాటుకున్నారు. జిల్లుండ పంచాయతీలో ఫిబ్రవరి 2న జరగనున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కోసం  సన్నద్ధం కావాలంటూ డిమిరియా గ్రామంలో శనివారం డ్వాక్రా మహిళలతో సమావేశం నిర్వహించారు. మంత్రి వచ్చినపుడు చప్పట్లు కొట్టాలని, పువ్వులు చల్లాలని, నవ్వుతూ ఉండాలని ఆదేశించారు. తాను ప్రభుత్వ ఉద్యోగినని మర్చిపోయిన ప్రసాదరావు.. వైకాపా కార్యకర్తల కంటే మిన్నగా ‘జై జగన్.. జైఅప్పలరాజు..’ నినాదాలు చేశారు. 

Updated : 29 Jan 2023 16:14 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు