TSPSC: గ్రూప్‌ 1 అభ్యర్థులకు పరిహారం చెల్లించాల్సిందే!: విపక్షాల డిమాండ్

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు పారదర్శకంగా జరగడం లేదనటానికి హైకోర్టు తీర్పే నిదర్శనమని విపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ప్రశ్నాపత్రాలు లీకైనప్పటికీ మేల్కొనని టీఎస్‌పీఎస్సీ (TSPSC).. సరైన నిబంధనలు పాటించకుండానే మరోసారి గ్రూప్‌ 1 పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ధ్వజమెత్తాయి. వెంటనే టీఎస్‌పీఎస్సీ పాలకవర్గాన్ని భర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్‌, భాజపా, బీఎస్పీ సహా విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. కొత్త కమిషన్‌ ఏర్పాటుతో పాటు.. నష్టపోయిన అభ్యర్థులకు సర్కార్‌ పరిహారం అందించాల్సిందేనని పట్టుబట్టారు.

Updated : 23 Sep 2023 20:25 IST
Tags :

మరిన్ని