కాళేశ్వరం ప్రాజెక్టుతో కొండపోచమ్మ మాత్రమే నింపుతున్నారు: ప్రవీణ్

దశాబ్ది ఉత్సవాలకు జనాన్ని బలవంతంగా భారాస నేతలు తరలిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఆరోపించారు. ప్రభుత్వ పథకాల్లో కోతపెడతామంటూ బెదిరిస్తున్నారని ఆయన విమర్శించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పర్యటించిన ప్రవీణ్ కుమార్  105 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెడుతూ భారాస ప్రచారం చేసుకుంటోందని ఆక్షేపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మ మాత్రమే నింపుతున్నారని ఆరోపించారు. 

Published : 08 Jun 2023 20:27 IST

మరిన్ని