బామ్మ 100వ పుట్టిన రోజు.. 20 ఏళ్ల తర్వాత ఒక్కచోటకు చేరిన కుటుంబసభ్యులు

ఇటీవలే వందేళ్ల పుట్టిన రోజు వేడుకలు చేసుకుంది ఓ బామ్మ. మెదక్ జిల్లా ముండ్రాయి గ్రామానికి చెందిన పద్మాబాయి ఆదివారం వందో సంవత్సరంలోకి అడుగు పెట్టింది. దీన్ని అరుదైన విషయంగా భావించిన కుటుంబసభ్యులు.. పుట్టిన రోజును పండగలా చేశారు. ఉద్యోగాల రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా.. 20 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరి ఆనందించారు. పద్మాబాయికి 9 మంది కుమార్తెలు, ఇద్దరు కొడుకులు కాగా, మనుమలు, ముని మనుమలతో కలిసి 85 మంది ఒకచోట చేరటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Published : 29 May 2023 21:43 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు