TSPSC: సరిగా వినలేదు.. మాట్లాడలేదు.. గ్రూప్ - 1 ప్రిలిమ్స్‌ పాసైంది!

కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam)లోని శాంతినగర్ కాలనీకి చెందిన మల్లయ్య తిరుపతమ్మకు ఇద్దరు కుమార్తెలు. చిన్ననాటి నుంచే దివ్యాంగురాలైన చిన్న కూతురు భవాని సరిగా మాట్లాడలేదు.. చెవులు సరిగా వినపడవు. ఐనప్పటికీ గ్రూప్ -1 ప్రిలిమ్స్‌ (TSPSC Group I) పరీక్ష రాసి పాసైంది. తీరా గ్రూప్ వన్ పరీక్షలు రద్దు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఉండడానికి కనీసం ఇల్లు సైతం లేదని.. మళ్లీ పరీక్ష రాసే స్థోమత తమకి లేదని ప్రభుత్వం, లేదా దాతలెవరైనా స్పందించి ఆదుకోవాలని తల్లి తిరుపతమ్మ కోరుతున్నారు.

Updated : 30 Mar 2023 14:54 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు