అలియా విద్యాలయంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

హైదరాబాద్‌లో గన్ ఫౌండ్రీ ప్రభుత్వ అలియా బాలుర పాఠశాల, ఇంటర్మిడియట్  కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. చారిత్రక వారసత్వ సంపదకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన విద్యాలయంలో వేల సంఖ్యలో విద్యార్థులు విద్యనభ్యసించి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వారంతా చదువుకున్న బడికి వచ్చి.. చిన్ననాటి మిత్రులతో  కలిసి ఆనందంగా గడిపారు. ఇందులో విదేశాల్లో స్థిరపడిన వారు.. బ్యూరోక్రాట్లు, రాజకీయ నేతలు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లుగా ఎదిగిన వారు ఉన్నారు. 150 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా పూర్వవిద్యార్థుల సమ్మేళనం కన్నుల పండుగగా జరిగింది.

Published : 18 Dec 2022 22:21 IST

Tags :

మరిన్ని