Gurthunda Seethakaklam: ‘గుర్తుందా శీతాకాలం’.. ఈ తరానికి ‘గీతాంజలి’: సత్యదేవ్‌

కన్నడ నటుడు నాగశేఖర్ తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతూ నిర్మించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. సత్యదేవ్, తమన్నా, కావ్యాశెట్టి, మేఘా ఆకాశ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ సినీమ్యాక్స్‌లో చిత్ర బృందం ‘గుర్తుందా శీతాకాలం’ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈతరం ప్రేక్షకులకు తన చిత్రం ఓ ‘గీతాంజలి’గా గుర్తుండిపోతుందని కథానాయకుడు సత్యదేవ్ ఆనందం వ్యక్తం చేశారు. నాలుగు విభిన్న ప్రేమకథలతో.. ప్రతి కథా ఒక్కోతరం ప్రేక్షకులకు నచ్చుతుందని సత్యదేవ్ తెలిపారు. 

Published : 03 Dec 2022 19:18 IST

మరిన్ని