Gurtunda Seetakalam: మనసుని హత్తుకునేలా ‘గుర్తుందా శీతాకాలం’ ట్రైలర్‌

హైదరాబాద్‌: సత్యదేవ్‌, తమన్నా జంటగా నటించిన ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. నాగశేఖర్‌ దర్శకుడు. డిసెంబర్‌ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కాలేజీ యువకుడిగా సత్యదేవ్‌ నటన ఆకట్టుకునేలా ఉంది. ‘‘ఒకానొక సయమంలో దేవ్‌ అనే అబ్బాయి ఉండేవాడు’’ అంటూ సత్యదేవ్‌ తన పాత్ర గురించి పరిచయం చేసే సంభాషణలతో మొదలైన ట్రైలర్‌లో.. ఆయన మూడు విభిన్నమైన లవ్‌ స్టోరీలు కలిగిన వ్యక్తిగా కనిపించనున్నారు. ట్రైలర్‌ చివర్లో ఆయన చెప్పే.. ‘‘ప్రేమించడం అంటే మనకు ఇష్టమైన వాళ్ల కోసం ఇష్టమైంది చేయడమే కదా’’ వంటి డైలాగ్స్‌ మనసుని హత్తుకునేలా ఉన్నాయి.

Published : 03 Dec 2022 13:11 IST

Tags :

మరిన్ని