Viral Video: పైనాపిల్‌ను ఇంత సులువుగా కోయొచ్చా!.. వీడియో వైరల్‌

అందరూ ఎంతో ఇష్టాంగా తినే పండ్లలో పైనాపిల్‌ ఒకటి. రుచితోపాటు ఎన్నో పోషక విలువలున్న పైనాపిల్‌ను కోయడానికి కొంత కష్టపడాల్సిందే. అందుకే చాలా మంది ముందుగానే ముక్కలుగా కోసిన పండ్లను కొని తెచ్చుకుంటారు. అయితే ఓ ఫుడ్‌ వీడియో క్రియేటర్‌ దీనికి చక్కటి పరిష్కారం చూపాడు. పైనాపిల్‌ను సులువుగా కోసే విధానాన్ని చెబుతూ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోను ఇప్పటివరకు 20 మిలియన్లకుపైగా వీక్షించడంతో వైరల్‌గా మారింది.

Published : 15 Mar 2023 15:11 IST
Tags :

మరిన్ని