Vikarabad Rains: వామ్మో ఇదెక్కడి వాన.. రహదారుల నిండా వడగళ్లే..!

వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలో గురువారం వడగళ్ల వర్షం దంచికొట్టింది. వర్షపు చినుకులను మించి ఏకధాటిగా వడగళ్లు పడ్డాయి. ఫలితంగా రహదారులు, ఇంటి వాకిళ్లన్నీ వడగళ్లతోనే నిండాయి. మండలంలోని దాదాపు 1000 ఎకరాల్లో ఉల్లి పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కూరగాయల పంటలు 70 శాతం వరకు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, సంగారెడ్డి జిల్లాలోని కొహీర్, జహీరాబాద్ మండలాల్లో.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వడగళ్ల వాన పడటంతో ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు.

Updated : 16 Mar 2023 16:40 IST

Tags :

మరిన్ని