TS News: దాదాపు 48 వేల ఎకరాల్లో పంట నష్టం.. వరంగల్ జిల్లా రైతుల కన్నీరుమున్నీరు!

వరంగల్ జిల్లా వ్యాప్తంగా వడగండ్ల వానలు రైతులను బేజారెత్తించాయి. చేతికంది వచ్చిన పంటలు గంటల వ్యవధిలోనే వర్షార్పణమయ్యాయి. కల్లాల్లో ఉన్న మిరప పంట తడిసి ఎందుకూ కొరగాకుండా పోయింది. నర్సంపేట, ఖానాపురం, గీసుకొండ, దుగ్గొండి, తదితర మండలాల్లో.. మక్క, మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారు. అత్యధికంగా 48 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టం జరిగింది. కష్టపడి పండించిన పంట అక్కరకు రాకుండాపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.  

Published : 20 Mar 2023 14:54 IST

Tags :

మరిన్ని