Silver Saree: వెండిపోగులతో పరిమళించే పట్టుచీర.. సిరిసిల్ల నేతన్న ప్రతిభ

రాజన్న సిరిసిల్ల (Sirisilla) జిల్లా కేంద్రానికి చెందిన నల్ల విజయ్‌ వెండి చీర (Silver Saree) నేసి ఔరా అనిపించారు. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చాటిచెప్పిన నల్ల పరంధాములు కుమారుడే ఈ విజయ్‌. తాజాగా వెండిపోగులతో పరిమళించే పట్టుచీరను మగ్గంపై నేశారు. సిరిసిల్ల కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి తల్లి జ్యోతి కోరిక మేరకు సిరిచందన పట్టు, పూర్తి వెండి యార్న్‌తో చీర తయారు చేశారు. 90 గ్రాముల వెండితో, అయిదున్నర మీటర్ల పొడవు, 48 ఇంచుల పన్నా వేసిన 600 గ్రాముల చీరకు రూపకల్పన చేశారు. ఇందుకు 45 రోజుల సమయం పట్టిందని, రూ.45 వేలు వెచ్చించినట్లు తెలిపారు.

Updated : 06 Jan 2023 17:40 IST

Tags :

మరిన్ని