HanuMan: విజువల్‌ వండర్‌గా ‘హను-మాన్‌’ టీజర్‌

హైదరాబాద్‌: ‘జాంబి రెడ్డి’ తర్వాత యువ నటుడు తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్‌ వర్మ కాంబోలో వస్తోన్న రెండో సినిమా ‘హను-మాన్‌’. అమృతా అయ్యర్‌ కథానాయిక. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలకపాత్ర పోషించారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో సూపర్‌హీరో చిత్రంగా ఇది తెరకెక్కింది. తాజాగా ఈసినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఓ విలువైన మణి కోసం సాగే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది. పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ వీడియోలో విజువల్స్‌ అదరహో అనేలా ఉన్నాయి. ముఖ్యంగా హనుమాన్‌ భారీ విగ్రహం టీజర్‌ చివర్లో ఆయన్ని చూపించిన తీరు.. ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంది. పాన్‌ ఇండియా స్థాయిలో ఇది విడుదల కానుంది.

Published : 21 Nov 2022 13:10 IST

Tags :

మరిన్ని