Harish Rao: ఏపీ నేతలకు చేతనైతే.. వాటి కోసం పోరాడండి: హరీశ్‌

ఆంధ్రప్రదేశ్‌ గురించి తాము ఏనాడూ తప్పుగా మాట్లాడలేదని మంత్రి హరీశ్‌ రావు (Harish Rao) స్పష్టం చేశారు. అడిగినదానికి సమాధానం చెప్పలేకే.. అక్కడి నేతలు కొందరు ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. సిద్దిపేటలో నిర్వహించిన భారాస (BRS) ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌ మాట్లాడారు. ఏపీ నేతలకు చేతనైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు కోసం పోరాడాలని సూచించారు. కాళేశ్వరం మాదిరిగా పోలవరం పూర్తి చేసి నీళ్లు అందించాలన్నారు.

Updated : 17 Apr 2023 15:08 IST
Tags :

మరిన్ని