Rangamarthanda: హాస్యనటుడు బ్రహ్మానందం నుంచి ఇంత ఎమోషనల్‌ డైలాగా..!

ప్రకాష్‌రాజ్‌ (Prakash Raj), రమ్యకృష్ణ (Ramya Krishna), బ్రహ్మానందం (Brahmanandam) ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda). కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకుడు. బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ చిత్ర బృందం ప్రత్యేక గ్లింప్స్‌ను  వదిలింది. ఇందులో బ్రహ్మానందం తన గద్గద స్వరంతో చెప్పిన ఎమోషనల్‌ డైలాగ్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. రంగస్థల కళాకారుల జీవితాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 16 Mar 2023 18:55 IST

మరిన్ని