Hyderabad Rain: భాగ్యనగరంలో దంచికొట్టిన వాన.. చెరువులను తలపించిన రోడ్లు

రాజధానిలో బుధవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. గంట వ్యవధిలో కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బాలానగర్‌లో 10  సెం.మీ. వర్షపాతం నమోదైంది. పెద్దఅంబర్‌పేట్‌, పేట్‌బషీరాబాద్‌, జీడిమెట్ల ప్రాంతాల్లో దంచికొట్టింది. ఫతేనగర్‌ దీన్‌దయాల్‌నగర్‌ కాలనీ రోడ్లు నీళ్లతో నిండిపోయాయి. ఖైరతాబాద్‌, పంజాగుట్ట అమీర్‌పేట, మైత్రీవనం, జూబ్లీహిల్స్‌, నాంపల్లి, మెహిదీపట్నం, హిమాయత్‌నగర్‌ ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. కృష్ణానగర్‌, బోరబండ ప్రాంతాల్లో వరదనీటి ఉద్ధృతికి పలు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి.

Published : 13 Oct 2022 09:42 IST

Tags :

మరిన్ని