AP Rains: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. జలమయమైన రహదారులు

ఉత్తరాంధ్రలో జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో పలు రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండటంతో  ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అరకులోయ ఘాట్ రోడ్డులో భారీ వర్షానికి బీసుపురం వద్ద వరద నీటి ఉద్ధృతికి వాహనాల రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాల కారణంగా కొండ పైనుంచి వర్షపు నీరు ప్రవాహంగా వస్తుండటంతో.. పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజక వర్గంలో భారీ వర్షాలకు రహదారులన్నీ జలమయమయ్యాయి. బూర్జ మండలం పెద్దపేట పంచాయతీ బొమ్మిక రిజర్వాయర్ పొంగి ప్రవహిస్తోంది. 

Published : 15 Oct 2022 15:52 IST

Tags :

మరిన్ని