Rains: హైదరాబాద్‌లో మళ్లీ వర్షం.. పలు చోట్ల వడగళ్ల వాన

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. పాతబస్తీ, చార్మినార్, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, బార్కస్, ఫలక్‌నుమ, నారాయణగూడ, లక్డీకపూల్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సూరారం, జగద్గిరిగుట్ట, గండిమైసమ్మ, సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, ప్యారడైజ్ ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపోయింది. వికారాబాద్ జిల్లా.. మోమిన్ పేట్ మండలం చక్రంపల్లిలో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. 

Published : 18 Mar 2023 19:10 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు