Tirumala: జలమయమైన శ్రీవారి మెట్టు మార్గం.. నడకదారి భక్తులను అనుమతించని తితిదే

మాండౌస్‌ తుపాను ప్రభావంతో తిరుమలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీవారి కొండ తడిసి ముద్దయింది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో భక్తుల రాకపోకలను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిలిపివేసింది. పాపవినాశనం, శిలాతోరణం మార్గాలను తితిదే మూసివేసింది. భారీ స్థాయిలో కురుస్తోన్న వర్షాలకు తిరుమలలోని అన్ని జలాశయాలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు నడిచి వెళ్లే భక్తులను తితిదే అనుమతించడంలేదు. తుపాన్ కారణంగా మెట్టు మార్గంలో నీరు ప్రవహిస్తుండడంతో ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా మూసివేసినట్టు తితిదే అధికారులు తెలిపారు. తుపాను ఉధృతి తగ్గిన అనంతరం తిరిగి నడక మార్గంలో భక్తులు వెళ్లవచ్చని అధికారులు తెలిపారు. అలిపిరి శ్రీవారి పాదాల చెంత ఉన్న కపిలతీర్థం వద్ద జలపాతం ఉదృతంగా ప్రవహిస్తుండటంతో పుష్కరణిలో భక్తులను స్నానానికి అనుమతించడం లేదు.

Updated : 10 Dec 2022 17:24 IST

Tags :

మరిన్ని