Kedarnath: కేదార్‌నాథ్‌లో వారం రోజులుగా విపరీతంగా కురుస్తున్న మంచు

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో వారం రోజులుగా విపరీతమైన మంచు కురుస్తోంది. కేదార్‌నాథ్‌ ఆలయం చుట్టూ పెద్దఎత్తున మంచు పేరుకుపోయింది. చుట్టుపక్కల ప్రాంతాలను హిమం కప్పేసింది. కేదార్‌నాథ్‌కు వెళ్లే నడక మార్గంలోని భైరవ్ గదేరా వద్ద మంచుకొండ విరిగిపోయింది. నడక మార్గంలోని కొంత భాగం దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మంచును తొలిగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. యంత్రాల సాయంతో మంచును తొలగిస్తున్నట్లు తెలిపారు. వారం రోజులు నుంచి నిరంతరాయంగా మంచు కురుస్తోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Updated : 21 Mar 2023 17:39 IST

Tags :

మరిన్ని