FIFA World Cup 2022: మెరుపు వేగంతో హిచాన్‌ గోల్‌.. కొరియా విజయహాసం

గ్రూప్‌-హెచ్‌లో రెండు విజయాలతో పోర్చుగల్‌ ముందే నాకౌట్‌ బెర్తును ఖరారు చేసుకోగా.. మరో బెర్తు కోసం ఉరుగ్వే, దక్షిణ కొరియా, ఘనా పోటీలో నిలిచాయి. ఒత్తిడి కమ్మేస్తుండగా కొరియా అద్భుతమే చేసింది. హి చాన్‌ (91వ ని) ఓ సూపర్‌ గోల్‌ చేసి కొరియా నాకౌట్‌ ఆశలకు ప్రాణం పోశాడు. పోర్చుగల్‌ గోల్‌ బాక్స్‌ సమీపంలో పాస్‌ అందుకున్న చాన్‌ పొరపాటుకు తావీయకుండా గోల్‌ కొట్టేశాడు. 2-1 ఆధిక్యాన్ని ఆఖరిదాకా కాపాడుకున్న కొరియా విజయహాసం చేసింది. దీంతో అనూహ్యంగా కొరియా.. పోర్చుగల్‌ను ఓడించి పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

Published : 03 Dec 2022 13:32 IST

మరిన్ని