Anatapur: అనంతపురంలో తెలుగు యువత నిరసన.. ఉద్రిక్తత

అనంతపురంలో వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్‌ రెడ్డి ఇంటి ముట్టడికి తెలుగు యువత ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇవాళ ఉదయం అనంతపురం చేరుకున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు.. రహస్యంగా ఆ విభాగం కార్యకర్తలతో సమావేశం నిర్వహించి చందు ఇంటి ముట్టడికి తరలివెళ్లారు. తెలుగు యువత నాయకులు చందు ఇంటి వద్దకు చేరుకుంటుండగానే.. విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. తెలుగు యువత నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. 

Updated : 28 Nov 2022 16:14 IST

Tags :

మరిన్ని