HIT 2: పోలీసులకే చెమటలు పట్టించిన ఈ హంతకుడెవరు?

హైదరాబాద్‌: అందమైన సాగరతీరం.. ప్రశాంతమైన జన జీవనం.. సంజన అనే అమ్మాయి హత్య వైజాగ్‌ నగర జనుల్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఆ ప్రాంత పోలీసులకు సవాలుగా మారింది. మరి, పోలీసులు ఆ హంతకుడిని ఎలా పట్టుకున్నారు? అమ్మాయిలను హింసించి చంపిన ఆ హంతకుడెవరు?ఉత్కంఠభరితమైన అంశాలతో తెరకెక్కిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘హిట్‌ -2’ (HIT 2). శైలేశ్‌ కొలను దర్శకుడు. అడివిశేష్‌ (Adivi Sesh) పోలీస్‌ పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ‘‘సాధారణంగా ఈ క్రిమినల్స్‌ తెలివి తక్కువ వాళ్లు. కోడి బుర్రలు. ఐదు నిమిషాలు చాలు వీళ్లని పట్టుకోవడానికి’’ అంటూ శేష్‌ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌లోని ప్రతి సీన్‌ ఉత్కంఠకు గురి చేసేలా ఉంది.

Updated : 23 Nov 2022 12:56 IST
Tags :

మరిన్ని