Hyderabad: ఆకట్టుకుంటున్న హోటల్‌ గణేశ్‌

గణేశ్‌ నవరాత్రి (Ganesh Chaturthi) ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో సంతోష్ దాబా నిర్వాహకులు ఏర్పాటు చేసిన లంబోదరుడి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. వారు హోటల్ రూపంలో గణేశ్‌ మండపం సెట్టింగ్‌ను ఏర్పాటు చేశారు. విఘ్నేశ్వరుడి విగ్రహం ముందు 56 రకాల స్వీట్లను నైవేద్యంగా పెట్టారు. తాము చేసే వృత్తిని తెలిపేందుకు ప్రతి సంవత్సరం ఇలా హోటల్ సెట్టింగ్‌తో వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.

Published : 27 Sep 2023 17:23 IST
Tags :

మరిన్ని