Hud Hud Cyclone: ఏళ్లు గడుస్తున్నా.. ‘హుద్‌హుద్‌’ బాధితులకేది భరోసా..?

2014 అక్టోబర్‌లో సంభవించిన హుద్‌హుద్‌ తుపాను (Hud Hud Cyclone) ధాటికి పదుల సంఖ్యలో వ్యక్తులు మృతి చెందగా.. శ్రీకాకుళం జిల్లా సముద్ర తీర ప్రాంతాల్లోని పలు గ్రామాలు అతలాకుతలం అయ్యాయి. దీంతో ఆనాటి తెదేపా ప్రభుత్వం గూడు కోల్పోయిన బాధితులకు తాత్కాలిక ఆశ్రయం కల్పించింది. తర్వాత ఇల్లు కోల్పోయిన ప్రతి పేదవాడికి హుద్‌హుద్‌ గృహాలను అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఆ పక్కా గృహాలు లబ్దిదారులకు చేతికందే సమయంలో ప్రభుత్వం మారడంతో అవి అలాగే నిలిచి పోయాయి. కొత్తగా వచ్చిన వైకాపా ప్రభుత్వం వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ లబ్దిదారులకు కేటాయించకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుతున్నాయి.  

Published : 27 Mar 2023 22:55 IST

Tags :

మరిన్ని