Crime News: బొట్టు బిళ్లల తయారీ పేరిట కేటుగాళ్ల నయా మోసం..

ఇంట్లో కూర్చుని సంపాదించే ఉద్యోగం. పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ. ఒక్కసారి డబ్బులు వెచ్చించారంటే.. జీవితాంతం కూర్చొని సంపాదించొచ్చు. ఇలాంటి మాటలు సాధారణంగా ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంటాయి. మాయ మాటలు నమ్మి వెనుకా.. ముందు.. ఏమీ ఆలోచించరు. నిండా మునిగాక నెత్తీనోరు బాదుకుంటారు. ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్న ఇలాంటి మోసాలతో కొందరు కేటుగాళ్లు అమాయకుల జీవితాలతో ఆటలాడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఓ ఘటనలో బాధితుల తీగలాగితే తెలుగు రాష్ట్రాల్లో డొంకంతా కదిలొచ్చింది.  

Published : 29 Nov 2022 12:42 IST

మరిన్ని