Gas: బాల్టిక్‌ సముద్రంలో పెద్ద ఎత్తున లీకవుతున్న మీథేన్‌.. భారీ పేలుళ్లే కారణం?

రష్యా నుంచి జర్మనీకి గ్యాస్ తీసుకొచ్చే నార్డ్ స్ట్రీమ్ 1, 2 పైపులైన్లలో మూడు చోట్ల గ్యాస్ లీకేజికి భారీ పేలుళ్లే కారణమని భూకంప శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇది విద్రోహ చర్యేనని డెన్మార్క్, పోలాండ్ భావిస్తున్నాయి. బాల్టిక్  సముద్రంలోకి భారీగా విడుదలవుతున్న మిథేన్ కారణంగా వాతావరణంపై పెద్ద ఎత్తున ప్రతికూల ప్రభావం పడనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు శాశ్వతంగా ఈ పైపులైన్ల మూసివేతకు ఈ పరిణామం దారి తీయవచ్చని, ఇది ఐరోపాలో గ్యాస్ ధరలు మరింత పెరిగేందుకు కారణం అవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Published : 28 Sep 2022 16:24 IST

Tags :

మరిన్ని