భార్య గొలుసు మింగేసిన భర్త.. ఆపరేషన్ లేకుండానే బయటకు తీసిన వైద్యులు

అనంతపురం జిల్లా ధర్మవరంలో మతిస్థిమితం లేని ఒక వ్యక్తి తన భార్య నల్లపూసల గొలుసు మింగేశారు. రాజేంద్రనగర్‌కు చెందిన రామాంజనేయులు అప్పుడప్పుడూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలో నెల క్రితం తన భార్య నల్లపూసల గొలుసు మింగేశాడు. ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఇటీవల అనారోగ్యం బారిన పడగా.. కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు పొట్టలో గొలుసును గుర్తించారు. ఆపరేషన్ చేసి గొలుసు బయటకు తీయాలని వైద్యులు చెప్పారు. అంత ఖర్చు భరించలేమంటూ.. బాధిత కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ సుకుమార్ బృందం ఎలాంటి ఆపరేషన్ లేకుండానే నోటి ద్వారా గొలుసును బయటకు తీశారు. 

Updated : 02 Jun 2023 13:30 IST
Tags :

మరిన్ని