Hyderabad: దక్కన్‌ మాల్‌ కూల్చివేతలో తప్పిన పెను ప్రమాదం..!

సికింద్రాబాద్‌ మినిస్టర్‌ రోడ్డులోని దక్కన్‌ మాల్‌ భవనం కూల్చివేతలో పెను ప్రమాదం తప్పింది. ఈ నెల 19న ఆరంతస్తుల ఈ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఉండటంతో అధికారులు భవనం కూల్చివేతను మొదలుపెట్టారు. అయితే, యంత్రంతో కొద్దికొద్దిగా కూల్చివేస్తుండగా.. ఒక్కసారిగా భవనం కుప్పకూలింది. భవనం చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చుట్టుపక్కల ఇళ్లలోని వారిని అంతకుముందే ఖాళీ చేయించడంతో.. ఎలాంటి ప్రమాదం జరగలేదని జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు.

Updated : 31 Jan 2023 15:38 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు