Hyderabad: తమన్‌ మ్యూజిక్‌.. ‘ఫార్ములా - ఈ రేస్‌’ థీమ్‌ సాంగ్ అదిరిందిగా!

హైదరాబాద్‌కు రేసుల పండగ మళ్లీ వచ్చింది. ఎఫ్‌ఐఏ ఫార్ములా-ఈ (Formula E) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా..  నాలుగో రేసు ఈ నెల 11, 12 తేదీల్లో హైదరాబాద్‌ (Hyderabad) వేదికగా జరగనుంది. ఇందుకోసం హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌లో 20,000 మంది ప్రేక్షకులు రేసుల్ని వీక్షించేలా ఏర్పాటు చేశారు. ప్రేక్షకుల గ్యాలరీలను 6 విభాగాలు విభజించి టికెట్‌ రేట్లను నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే  ప్రచారపర్వం షురూ చేసిన నిర్వాహకులు.. తాజాగా హైదరాబాద్‌ ఈ-ప్రిక్స్‌ (Hyderabad E Prix) పేరుతో థీమ్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్‌కు తమన్‌ మ్యూజిక్‌ డైరెక్ట్‌గా వ్యవహరించడం విశేషం.

Published : 08 Feb 2023 20:42 IST

మరిన్ని