Bapatla: బాపట్లలో వైకాపా నేతల ఇసుక దోపిడీ

బాపట్ల (Bapatla) జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెంలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. గ్రామంలోని అసైన్డ్ భూమిలో భారీగా ఇసుకను తవ్వి తరలిస్తున్నా.. అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార వైకాపా (YSRCP) నేతలే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని సర్పంచ్ మండిపడుతున్నారు. ఇసుక అక్రమ రవాణాతో దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. సుమారు 20 అడుగుల లోతులో ఇసుక తవ్వకాలు జరిగాయని తెలిపారు.  

Updated : 23 Sep 2023 14:01 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు