Atal Pension Yojana: ఆదాయపు పన్ను చెల్లింపుదార్లు అటల్‌ పింఛన్‌ యోజనకు అనర్హులు

ఆదాయపు పన్ను చెల్లింపుదార్లు అక్టోబరు 1 నుంచి అటల్‌ పింఛన్‌ యోజన (ఏపీవై)కు అనర్హులని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ‘2022 అక్టోబరు 1 కంటే ముందు ఈ పథకంలో చేరిన వారికి ఈ నిబంధన వర్తించదు. ఒకవేళ ఎవరైనా ఆ తర్వాత ఏపీవైలో చేరినట్లు గుర్తిస్తే వెంటనే వారి ఖాతాను మూసివేస్తాం. అప్పటివరకు వారు జమ చేసిన మొత్తాన్ని తిరిగి చందాదార్లకు చెల్లిస్తామ’ని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Published : 12 Aug 2022 13:28 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని