IND vs NZ: ముందే కప్‌ పట్టేసిన కేన్‌ విలియమ్సన్‌.. అదెలాగో చూడండి..!

అదేంటి సిరీస్‌ గెలవకుండా న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్ కప్‌ను పట్టేయడమేంటని అనుకుంటున్నారా..? కప్‌ను పట్టేయడమంటే గెలవడం కాదు.. కింద పడబోయే కప్‌ను ఒడిసిపట్టాడు. మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభం ముందు ఇరు జట్ల కెప్టెన్లు కేన్, హార్దిక్‌ కప్‌ను ఆవిష్కరించారు. అయితే భారీగా గాలి వీయడంతో కప్‌ పెట్టిన వేదిక పడబోయింది. దీంతో వెంటనే కేన్‌ కప్‌ను ఒడిసిపట్టుకోగా.. హార్దిక్‌ ఆ చిన్న వేదికను అడ్డుకొన్నాడు.

Published : 17 Nov 2022 20:10 IST

Tags :

మరిన్ని