Asian Games: భారత మహిళా క్రికెట్‌ జట్టుకు స్వర్ణ పతకం ప్రదానోత్సవం

ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో (Asian Games) భారత మహిళా క్రికెట్‌ జట్టు స్వర్ణ పతకం సాధించింది. సోమవారం శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్‌ఇండియా.. భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులకు పరిమితమైంది. భారత జట్టుకు గోల్డ్‌ మెడల్‌ అందజేస్తున్న వీడియో మీరూ చూడండి. 

Updated : 25 Sep 2023 17:57 IST
Tags :

మరిన్ని