China: మక్సర్‌ ఉపగ్రహ చిత్రాలతో బయటపడ్డ చైనా చేష్టలు

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ వద్ద చొరబాట్లకు యత్నించి భంగపడ్డ చైనా.. సరిహద్దుల్లో మళ్లీ రెచ్చ గొట్టే చర్యలకు పాల్పడుతోంది. వాస్తవాధీన రేఖకు సమీపంలోని ఎయిర్  బేస్‌ల వద్ద పెద్దఎత్తున యుద్ధ విమానాలు, డ్రోన్లను మోహరించింది. భారత గగనతలంలోకి అక్రమంగా చొరబాటుకు యత్నిస్తోంది. తాజాగా మక్సర్ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలలో ఈ విషయం బయటపడింది. చైనా ఎలాంటి దుందుడుకు చర్యకు దిగినా దీటుగా బదులిచ్చేందుకు భారత్ కూడా సిద్ధమైంది. అధునాతన యుద్ధ విమానాలను రంగంలోకి దించింది.

Published : 19 Dec 2022 19:36 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు