Spelling Bee: స్పెల్లింగ్ బీ పోటీల్లో విజేతగా నిలిచిన దేవ్ షా

అమెరికాలో ఏటా జరిగే ప్రతిష్ఠాత్మక స్పెల్లింగ్ బీ (Spelling Bee) పోటీల్లో భారత సంతతికి చెందిన 14 ఏళ్ల కుర్రాడు దేవ్ షా విజేతగా నిలిచాడు. స్క్రిప్ నేషనల్ స్పెల్లింగ్ బీ ట్రోఫీతో పాటు 50 వేల డాలర్ల ప్రైజ్ మనీని అందుకున్నాడు. సామ్మోఫైల్ అనే పదాన్ని తప్పుపోకుండా చెప్పడంతో దేవ్ షా విజేతగా నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా 11 లక్షల మంది పోటీపడగా, తుదిరౌండ్‌లో 11 మంది నిలిచారు. ఈ పోటీల్లో గెలిచిన 22వ దక్షిణాసియా సంతతి వ్యక్తిగా దేవ్‌షా నిలిచాడు. 

Published : 02 Jun 2023 16:47 IST

మరిన్ని