Indrakaran: ఆ ఆధారాలుంటే చూపండి..: మహేశ్వర్‌ రెడ్డికి మంత్రి ఇంద్రకరణ్‌ సవాల్‌

మున్సిపల్‌ ఉద్యోగాల నియమాకాల్లో తనపై మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి (Indrakaran Reddy Allola) ఖండించారు. నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం కాద‌ని.. ఆధారాలుంటే బ‌య‌ట‌ పెట్టాల‌ని స‌వాల్‌ విసిరారు. అసత్య ప్రచారం చేస్తున్నందున మహేశ్వర్‌ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. త‌ప్పు చేసినట్లు తేలితే.. చట్ట ప్రకారం ఏ శిక్షకైనా తాను సిద్ధమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో మహేశ్వర్‌ రెడ్డి ప‌నైపోయింద‌ని.. రేపో మాపో ఆయ‌న పార్టీ మారడం ఖాయ‌మ‌ని జోస్యం చెప్పారు. 

Published : 28 Mar 2023 18:10 IST

Tags :

మరిన్ని