Bandi Vs Eatela: బండి సంజయ్, ఈటల రాజేందర్‌ మధ్య అంతర్గత విభేదాలు!

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకుసాగుతున్న కమలం (BJP)లో కల్లోలం మొదలైంది. నివురుగప్పిన నిప్పులా నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. బండి సంజయ్ (Bandi Sanjay), ఈటల రాజేందర్ (Eatela Rajender) రెండు వర్గాలుగా వీడిపోవడం పార్టీకి తీవ్రనష్టాన్ని కలిగించేలా ఉంది. ఇప్పటికే జాతీయ నాయకత్వం ఇద్ధరు నేతలను దిల్లీ పిలిపించి.. విభేదాలు పక్కనపెట్టాలని, పార్టీ విజయానికి  పనిచేయాలని దిశానిర్దేశం చేసినా ఫలితం లేకపోయింది. ఈటల వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్న అధిష్ఠానం.. నేతలెవ్వరూ పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించింది.

Updated : 31 May 2023 10:09 IST
Tags :

మరిన్ని