Mehul Choksi: మెహుల్ ఛోక్సీపై రెడ్‌కార్నర్‌ నోటీసులు ఎత్తివేత!

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీపై.. రెడ్ కార్నర్ నోటీసులను ఇంటర్ పోల్ అధికారులు తొలగించినట్లు తెలుస్తోంది. చోక్సీ విజ్ఞప్తి మేరకు లియోన్‌లోని ఇంటర్ పోల్ ఏజెన్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై సీబీఐ గానీ.. భారత్‌లోని ఇంటర్ పోల్ నోడల్ ఏజెన్సీ అధికారులు ఇంకా స్పందించలేదు. కాగా, రెడ్ కార్న్ నోటీసులు జారీచేస్తే ప్రపంచవ్యాప్తంగా 195 దేశాల్లో ఎక్కడున్నా నిందితులను పట్టుకుని, అరెస్టు చేసే అధికారం ఇంటర్ పోల్ అధికారులకు ఉంటుంది. తాజా నిర్ణయంతో ఛోక్సీ ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రపంచంలో తిరిగే అవకాశం లభించనుంది.

Published : 21 Mar 2023 16:10 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు