Etela Rajender: తెరాసకు ₹870 కోట్లు ఎక్కడివి.. ఏం వ్యాపారం చేశారు..?: ఈటల

తెరాస పుట్టక ముందు నుంచే రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్‌గా ఉన్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసమే భాజపాలో చేరారని అంటోన్న సీఎం కేసీఆర్, కేటీఆర్ తడిబట్టలతో యాదగిరిగుట్ట నరసింహస్వామి మీద ప్రమాణం చేస్తారా? అని సవాల్‌ విసిరారు. మునుగోడులో రాజగోపాల్‌ రెడ్డి గెలుపు ఖాయమని ఈటల ధీమా వ్యక్తం చేశారు.

Published : 10 Oct 2022 17:35 IST

మరిన్ని